![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -323 లో.. అప్పు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి పాపని కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచారో కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత కావ్య అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడే కొరియర్ బాయ్ ఇంటికి వస్తాడు. ఎవరు ఆర్డర్ చేశారని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు.
ఆ తర్వాత డెలివరీ బాయ్ తీసుకొని వచ్చిన కొరియర్స్ అన్ని చీరలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేశారని చూస్తే దానిపై రుద్రాణి అని ఉంటుంది. నేనేం ఆర్డర్ చెయ్యలేదని రుద్రాణి అంటుంది. బిల్ డెబ్భై వేలు అయినవి ఆల్రెడీ పే చేశారంటూ డెలివరీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. నేనే చేసాను మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు కూడ పే చేశానని స్వప్న అనగానే అందరూ షాక్ అవుతారు.. కానీ నా కోసం ఆర్డర్ చెయ్యలేదు. కావ్య కోసం ఆర్డర్ చేశానని స్వప్న చెప్తుంది. నాకు కాకుండా నీకు కాకుండా ఆ కావ్యకి ఆర్డర్ చేసి పైగా నా డబ్బులు ఖర్చు పెడతావా అని రుద్రాణి అనగానే.. అవి మీ డబ్బులు ఎక్కడివి? ఇంట్లోవి కదా అని స్వప్న అంటుంది. అంత డబ్బులు పెట్టి నువ్వు ఎందుకు ఆర్డర్ పెట్టావ్ ? నేను కొనిచ్చే వాన్ని కదా అని రాజ్ అంటాడు. మా చెల్లిని ఎవరో అప్పలమ్మలాగా ఉంటావని కామెంట్ చేశారంట అందుకే తన కోసం ఇవ్వన్నీ ఆర్డర్ చేశాను. తనని మాడరన్ గా రెడీ చేస్తానని స్వప్న చెప్తుంది. రాజ్ ఏం సమాధానం చెప్పలేక ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. నా డబ్బులు ఖర్చు పెట్టిందని రుద్రాణి ఫీల్ అవుతుంటే.. ఖర్చు పెట్టింది నా కోడలు కోసమేగా నేను ఇస్తానని రుద్రాణికి అపర్ణ చెప్తుంది. కావ్య కోసం అంటే నా క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇచ్చేవాన్ని అని సుభాష్ అంటాడు. ఇక ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు కుళ్ళుకుంటారు.
ఆ తర్వాత అప్పు.. పాప దొరికిందా అంటూ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తూనే ఉంటుంది. ఒక స్కూల్ దగ్గర పాత ఇంటిలో రౌడీలు కన్పించారని ఒక ఫ్రెండ్ చెప్పగ్గానే.. అప్పుతో పాటు ఆ పాప వాళ్ళ అమ్మ బయలుదేరి వెళ్తారు.
ఆ తర్వాత కావ్యని మోడరన్ గా రెడీ చేసి స్వప్న తీసుకొని వస్తుంది. అందరూ కావ్య బాగుందంటు పొగుడుతారు. నాకు నచ్చలేదంటు ధాన్యలక్ష్మి వెళ్తుంది. చాలా బాగా రెడీ చేసావని స్వప్నకి కావ్య చెప్తుంది. ఇలాగే ఆఫీస్ కి వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత అప్పు వాళ్ళ పాప అమ్మ పాప ఉన్న దగ్గరికి వస్తారు. రౌడీలకి కనిపించకుండా పాపని చూస్తారు.
తరువాయి భాగంలో ఆఫీస్ కి వచ్చిన శ్వేతతో కావ్య మాట్లాడుతుంది. కావ్య మన ఫ్రెండ్ షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుందని శ్వేతా అనగానే.. నాకు ఆమె అంటే ఇష్టం లేదు.. త్వరలోనే విడిపోతా అనుకుంటున్నానని రాజ్ అంటాడు. నేను ఇప్పుడు వెళ్లి ఆమెకి మన గురించి క్లారిటీ ఇస్తానని శ్వేత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |